నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువుల తల్లి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.... 9రోజుల అలంకరణలో ఈ సోమవారం రోజు మొదటి రోజు అమ్మవారు భక్తులకు శైల పుత్రి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఆలయ అర్చక వైదిక బృందం ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి కట్టే పొంగలిని నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈఓ అంజనీదేవి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. భక్తులతో అమ్మ