ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని గోరంట్ల మల్టీప్లెక్స్ లో ఆదివారం సుందరాకాండ చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్ర హీరో నారా రోహిత్ తో పాటు చిత్రబృందం థియేటర్లో సందడి వాతావరణం నెలకొల్పింది. చిత్ర విజయోత్సవంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పాల్గొంటున్న చిత్ర బృందం ఆదివారం గోరంట్ల మల్టీప్లెక్స్ థియేటర్లో పాల్గొని ప్రేక్షకులకు సందడి వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. థియేటర్ యాజమాన్యం మరియు నారా రోహిత్ అభిమానులు స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం చిత్ర హీరో నారా రోహిత్ ను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు.