నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరధ కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు గురువారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 586.60 అడుగులు కాగా పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు ప్రాజెక్టు సామర్థ్యం ఉందని తెలిపారు ప్రస్తుతం 26 గేట్ల ద్వారా నీటిని దిగువనకు కిందికి వదిలినట్లు తెలిపారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి జల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు తెలిపారు.