అనంతపురం నగరంలోని పంపు హౌస్ వద్ద బాబా అనే యువకుడి పై సలీం జాఫర్ మహేష్ అనే ముగ్గురు విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచినట్లుగా బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తలపై తీవ్ర గాయాలు అవడంతో అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వారి కుటుంబ సభ్యులు తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.