ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం ఖాజీపురం గ్రామ ఎస్సీ కాలనీలోని ఎంపీపీ పాఠశాలను యధావిధిగా కొనసాగించాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు గురువారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అధికారులు ఎంపీపీ పాఠశాలను మోడల్ స్కూల్ లో విలీనం చేశారు. విలీనాన్ని వ్యతిరేకిస్తున్న ఎస్సీ కాలనీవాసులు ఎంపీపీ పాఠశాలను యధావిధిగా కొనసాగించాలని బయటాయించి నిరసన తెలిపారు. ఒకటి నుంచి 5వ తరగతి చదువుకునే విద్యార్థులు చదువుకునేందుకు దూరం వెళ్లవలసి వస్తుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.