సువేన్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేస్తూ ఈ దసరాకు 20 శాతం బోనస్ ఇవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మాణిక్ డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు మరియు పర్మనెంట్ చేసేంతవరకు తమ న్యాయ పోరాటం ఆగదని తెలిపారు. అన్ని పరిశ్రమలలో పండగలకు బోనస్ ఇస్తుంటే ఈ పరిశ్రమలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.