కూటమి ప్రభుత్వంలో మహిళలకు సముచిత స్థానం కల్పించామని ఎచెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నారు. గురువారం రణస్థలంలో" స్త్రీ శక్తి " విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ... ఎక్కడైతే స్త్రీ గౌరవింప బడుతుందో అక్కడ దేవతలు నడయాడతారని, స్త్రీ స్వరూపమే దుర్గామాత అని అన్నారు. ఎంపీ కలిశెట్టి, కూటమి నాయకులు పాల్గొన్నారు.