బేతంచెర్ల మండలం వైష్ణవ పుణ్యక్షేత్రమైన మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం కురిసిన భారీ వర్షానికి అమ్మవారి ఆలయం పక్కన ఉన్న కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అమ్మవారి ఆలయం పక్కన ఉన్న కొండ చరియలను తొలగించాలని భక్తులు కోరుతున్నారు.