కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుందని BRS నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం సాయంత్రం 5గంటలకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడిన ఆయన బి ఆర్ ఎస్ పార్టీ తన తీరు మార్చుకొకపోతే తెలంగాణ ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని అన్నారు. గాయత్రి పంప్ హౌస్ కి కూతవేటు దూరంలో ఉన్న గ్రామాలకు నీరు అందలేదని, గత పదేళ్లలో కొండగట్టు దేవస్థానానికి ఒక రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. కేటీఆర్ ఇక్కడి నాయకులకు చిల్లర డబ్బులు ఇచ్చి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.