ఆదోనిలోని ప్రధాన రహదారిలోని MM రోడ్డు వద్ద శనివారం సాయంత్రం గుర్తు తెలియని లారీ ఓ వ్యక్తి కాలుపై ఎక్కించింది. దీంతో కాలు నుజ్జునుజ్జు కాగా స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. అనంతరం వారిని ఆదోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తరలించారు. విచారణ నిమిత్తం కేసు నమోదు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలియజేశారు.