పరిసర ప్రాంతాలను, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించి మలేరియా వ్యాధిపై పోరాటాన్ని వేగవంతం చేద్దామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి.శాంతికళ విద్యార్థులకు పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం 11 గంటలకు కర్నూలులోని ముజఫర్ నగర్లో ఉన్న మున్సిపల్ ఉన్నత పాఠశాలలో సర్ రోనాల్డ్ రాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆడ అనా ఫిలస్ దోమల ద్వారా మలేరియా వస్తుందని ఈయన గుర్తించారని ఆమె తెలిపారు.