నరసరావుపేటలోని ఓ దుకాణంలో కొనుగోలు చేసిన బ్రాండెడ్ మరమరాల ప్యాకెట్లో చెక్క ముక్క రావడంతో వినియోగదారుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే ఈ విషయాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారి లక్ష్మణనారాయణకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం సాయంత్రం 6గంటలకు ఫుడ్ సేఫ్టీ అధికారి దుకాణాన్ని తనిఖీ చేసి, శాంపిల్స్ సేకరించి హైదరాబాద్లోని ల్యాబ్కు పంపించారు. నాణ్యతలో లోపం తేలితే కేసు నమోదు చేస్తామని ఆయన తెలిపారు.