పులివెందుల నియోజకవర్గంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేంపల్లి పట్టణంలోని నారాయణ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో వేంపల్లి టిడిపి మండల పరిశీలకుడు ఉపాధ్యాయులతో కలిసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సర్వేపల్లి గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన పలువురిని ఆయన అభినందించారు.