పులివెందుల మండల జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన మాట మేరకు HNSS మెయిన్ కెనాల్ నుంచి కడప జిల్లా పులివెందుల మండలం ఎర్రబల్లి చెరువుకు చేరుతున్న కృష్ణా జలాలను ఆదివారం గొల్లపల్లి తండా వద్ద పులివెందుల మండల జడ్పిటిసి లతారెడ్డి, తుంగ భద్ర హై లెవెల్ కెనాల్ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి, వేంపల్లి మండల పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. 'కృష్ణా జలాలు ఎర్రబల్లి చెరువుకు చేరడం తమ దీర్ఘకాల కృషి ఫలితం అన్నారు. ఇక పంటలకు నీటి కొరత ఉండదని చెప్పారు.