కరుడుగట్టిన నేరస్థుడు, రౌడీ షీటర్ శ్రీకాంత్ను నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విశాఖ జైలుకు తరలించారు. పెరోల్ రద్దు వ్యవహారం అప్పటినుంచి అతనికి భద్రత పెంచారు. నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విశాఖ జైలుకు తరలించే క్రమంలో విషయం బయటకు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జైలు నుంచి ప్రత్యేక వాహనంలో తరలించారు. ఈ ఘటన శనివారం ఉదయం 8 గంటలకి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రియురాలు అరుణతో కలిసి జిల్లా జైలు నుంచి అతను దందాలకు పాల్పడుతున్నారని పోలీసుల విచారణలో తేలింది