నెల్లిమర్ల సమీపంలో రైల్వే ట్రాక్పై గుత్తి తెలియని వృద్ధిని మృతదేహం గుర్తించినట్లు ఉదయం రైల్వే పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని వృద్ధుడు రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో గుర్తు తెలియని రైలు ఢీకొనడం వలన చనిపోయి ఉండవచ్చు అని భావిస్తున్నామన్నారు. మృతుని వయసు 65 సంవత్సరాలు ఉంటుందని, మృతుని చేతిపై శ్రీరాములు అని పచ్చబొట్టు ఉన్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుని వివరాలు తెలిసినవారు శ్రీకాకుళం రైల్వే పోలీసులను సంప్రదించాలని రైల్వే పోలీసులు సూచించారు.