ఆలూరు మండలం పెద్ద హోతూరు గ్రామంలో ఉల్లి రైతుల పొలాలను సందర్శించిన సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మునిస్వామి.. మంగళవారం వారి సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు. ఉల్లికి కనీసం మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చూడాలన్నారు. రైతులు ఇంత ఇబ్బంది పడుతున్న పట్టించుకోరా అని వారన్నారు.