జగిత్యాల జిల్లాలో ఇప్పటివరకు 5 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయబడుతుందని జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి జి.శ్యాంప్రసాద్ వెల్లడించారు.మంగళవారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూర్ గ్రామంలో ఆయిల్ పామ్ సాగు పద్ధతులపై, తోటల యాజమాన్యం మరియు ఉద్యాన శాఖ ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ సదుపాయాల గురించి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి శ్యాంప్రసాద్..లోహియా కంపెనీ జిల్లా మేనేజర్ విజయ్ భరత్ తో కలిసి సాయంత్రం 5-30 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 5000 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయబడుతుందన్నారు