అల్లూరి జిల్లాపాడేరులో ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదినాన్ని మెగా అభిమానులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలో మెగా అభిమానుల ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో నిర్వహించిన వేడుకలలో ముఖ్య అతిథులుగా పాడేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, జానపద కలలు సుజనాత్మక సంస్థ చైర్మన్ ఒంపురి గంగులయ్య పాల్గొన్నారు. భారీ కేక్ కట్ చేసి, స్థానిక పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ సేవా కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ జన్మదినాన్ని సేవా దినంగా నిర్వహించడం గర్వంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు పాల్గొన్నారు.