ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలో పలు మండలాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ తెలిపారు. వారంరోజులకుపైగా నిరంతర వర్షాలు పడటంతో జిల్లాలో అధిక శాతం రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.ఒక గ్రామంలో వరదనీరు చేరడంతో మూడు రోజులుగా గ్రామస్థులు బయటకు రాకుండా ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో అధికారులు వెంటనే స్పందించి నష్టపోయిన పంటలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశారు.రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, వారికి తక్షణమే ఉపశమనం కల్పించేందుకు ఎకరాకు కనీసం ₹30,000 నష్టపరిహారం ప్రకటించాలని గౌస్ దేశాయ్ రాష్ట్ర