ఇటీవల స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులతో ప్రాథమిక పాఠశాలలో చాలా ఎస్జీటీ పోస్టులు ఖాళీ అయ్యాయని, వాటిని తాత్కాలికంగా వెంటనే స్థానిక అర్హత గల విద్యావంతులను విద్యావాలంటీర్ లుగా నియమించి భర్తీ చేసే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (STU ) జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శులు మచ్చ శంకర్,బైరం హరికిరణ్, రాష్ట్ర కార్యదర్శి పాలేపు శివరామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు .ఈ మేరకు ఆదివారం రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు. మచ్చ శంకర్ , బైరం హరికిరణ్ మాట్లాడుతూ...ఉన్నత విద్యారంగానికి ప్రాథమిక పాఠశాలలు మూలం కాబట్టి ఉపాధ్యాయ, విద్యార్థి