సంగారెడ్డి పట్టణం రాజంపేటలోని బ్రహ్మకుమారి సంస్థ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని తెలిపారు. బ్రహ్మకుమారి సంస్థ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు పాల్గొన్నారు.