రాజమండ్రిలోని పుష్కరాల రేపు వద్ద గోదావరి నీటి ప్రవాహాన్ని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే శ్రీనివాస్ శుక్రవారం పరిశీలించారు. అధికారులకు ప్రజల భద్రత దృష్ట్యా పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంతో లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవకుండా ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏ నష్టం జరగదని వివరించారు.