Atmakur, Sri Potti Sriramulu Nellore | Aug 29, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, అనంతసాగరం మండలంలోని అనంతసాగరం, పాత దేవరాయపల్లి, లింగంగుంట, ఇనగలూరు, గౌరవరం, సంజీవనగరంతో పాటు పలు గ్రామాలలో మూడో రోజు శుక్రవారం నిమజ్జనాలు ఘనంగా జరిగాయి. వినాయక ప్రతిమలకు చివరి పూజ చేశారు. ఆ తర్వాత ఆయా గ్రామాల్లో ఊరేగించి నిమజ్జనానికి తరలించారు. అనంతసాగరం చెరువు వద్దకు నిమజ్జనం కోసం భారీగా గణనాథ విగ్రహాలు వచ్చాయి. దీంతో చెరువు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.