అయినవిల్లి మండలం, ముక్తేశ్వరం కాజ్వేపై వరద ప్రవాహం గురువారం మరింత పెరిగింది. దిగువన ఉన్న వీరవల్లిపాలెం, అయినవిల్లిలంక, పల్లపులంక, అద్దంకి వారి లంక గ్రామ ప్రజలు వరద నీటిలోనే ఇబ్బందులు పడుతూ రాకపోకలు సాగిస్తున్నారు. స్థానికులు మాట్లాడుతూ వరద సమయంలో ప్రతి ఏడాది ఈ తిప్పలు తప్పడం లేదని వాపోయారు