మంగళవారం వనపర్తి జిల్లా పరిధిలోని ఆత్మకూర్ సర్కిల్ కార్యాలయాన్ని మదనాపురం పోలీస్ స్టేషన్ ని సందర్శించిన జోగులాంబ జోన్ డిఐజి ఎల్ ఎస్ చౌహన్. ఈ సందర్భంగా డిఐజి మాట్లాడుతూ గ్రామాలకు సంబంధించిన వీపిఓ లు రెండు మూడు రోజులకు ఒకసారి సందర్శించి శాంతియుత వాతావరణం ఉండేలా కృషి చేయాలని కోరారు. బ్లూ కోల్డ్ పెట్రో కార్ విధులు అప్రమత్తంగా నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే డయల్ హండ్రెడ్ కాల్స్లకు వెంటనే స్పందించి పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కోరారు.