Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 1, 2025
రాయులు పరిపాలించిన ఉదయగిరి ప్రాంతంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అలనాటి ప్రాచీన రంగనాయకుల గుడి అభివృద్ధికి సహకరించాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడును ఉదయగిరి విశ్వహిందూ పరిషత్ సభ్యులు విన్నవించుకున్నారు. స్పందించిన ఆయన సంబంధిత రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ఫోన్ ద్వారా ఆలయ అభివృద్ధికి కావలసిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.