Parvathipuram, Parvathipuram Manyam | Aug 28, 2025
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని పాచిపెంటలోని పెద్దగెడ్డ జలాశయంలో బుధవారం చేపల వేటకు వెళ్లిన కోడికాళ్ళవలస గ్రామానికి చెందిన గిరిజన మత్స్యకారుడు జన్ని బాలరాజు తెప్ప, బోల్తా పడడంతో జలాశయంలో గల్లంతయ్యాడు. ఈ మేరకు గురువారం ఫిర్యాదు అందుకున్న పాచిపెంట పోలీసులు జలాశయంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం నుండి సాయంత్రం వరకు గాలించినా బాలరాజు ఆచూకీ లభ్యం కాలేదు.