శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు నుంచి బుక్కపట్నంకు వెళ్ళు రహదారిలో శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంగమేశ్వర స్వామి గుడి సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్లడంతో డ్రైవర్ సడన్ బ్రేకు వేశారు. వెనుక నుంచి వస్తున్న బైక్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బుచ్చయ్యగారిపల్లికి చెందిన బాబు, చరణ్ గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక ప్రజలు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.