సంతమాగులూరు మండలం వెల్లల చెరువు వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న వారిని ఎదురుగా వస్తున్న కారు ఢీకొనటంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది సంఘటన స్థలాన్ని చేరుకొని వారిని నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రులు వినుకొండకు చెందిన తేజ కోటేశ్వరరావు లుగా పోలీసులు గుర్తించారు.