Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 29, 2025
ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే కాక, మీ సమస్యలు ఏవైనా ఉంటే తక్షణం పరిష్కరిస్తామని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక ఛైర్ పర్సన్ డా. సత్యన్నారాయణ అన్నారు. శుక్రవారం రాజవొమ్మంగి విద్యుత్ శాఖ కార్యాలయంలో న్యాయ పరిష్కార వేదిక కార్యక్రమంను నిర్వహించారు. సమస్యలు ఏవిధంగా పరిష్కరించుకోవచ్చునో వినియోగదారులకు అవగాహన కల్పించారు.