వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన తిరుపతి: రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర, ఎంపీడీవో ప్రభురావుతో కలిసి మండల పరిధిలోని వెంకటాపురం, కరకంబాడి చెరువులను సందర్శించారు. వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు భద్రతా చర్యలు, శుభ్రత, విద్యుత్, లైటింగ్, త్రాగునీరు వంటి సౌకర్యాలను సమీక్షించారు. ప్రజలు ప్రశాంతంగా నిమజ్జనం జరుపుకునేందుకు అన్ని చర్యలు చేపడతామని తెలియజేశారు. వారి వెంట పోలీసులు, అధికారులు ప్రజలు ఉన్నారు.