ఈనెల 26వ తేదీన జిల్లా కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము కోరారు. ఈ మేరకు సిరిసిల్ల పట్టణ ప్రెస్ క్లబ్లో వివరాలను వెల్లడించారు.సమావేశంలో చొక్కాల రాము సంగీతం శ్రీనివాస్ గడ్డం నరసయ్య కత్తెర దేవదాస్ బోప్ప దేవయ్య ఆకునూరి బాలరాజు గోనె ఎల్లప్ప రాగుల రాములు కోల నరేష్ దండు శ్రీనివాస్ పంబాల దేవరాజు మోతే బాబు తదితరులు పాల్గొన్నారు.