జమ్మికుంట పట్టణంలోని నాయిని చెరువు వద్ద శుక్రవారం నిర్వహించనున్న వినాయక నిమజ్జన ఏర్పాట్లను కరీంనగర్ సిపి గౌస్ ఆలం గురువారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని వినాయక నిమజ్జనం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశామని అన్నారు పోలీస్ రెవెన్యూ ఎలక్ట్రికల్ హెల్త్ శాఖల ఆధ్వర్యంలో సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. అదేవిధంగా పట్టణంలో ఎత్తైన విగ్రహాలను తరలించేటప్పుడు విద్యుత్ అధికారులు తప్పకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.