పశ్చిమబెంగాల్ రాష్ట్రం బంకురా జిల్లా, భశంతూర్ గ్రామానికి చెందిన ఆకుల బోరి (49) ఉపాధి కోసం శ్రీనివాసరావు అనే గుత్తేదారుడు ఐదురోజుల కిందట ఇక్కడికి తీసుకొచ్చారు. సోమవారం అచ్యుతాపురం నుంచి ఫెర్రో కంపెనీకి ఖాళీ కంటైనర్‌తో వెళ్తున్న లారీ ఇతనిని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వలస కార్మికుడు మృతిచెందిన విషయం గుర్తించిన స్థానికులు సమాచారం పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.