ఎన్నో ఏళ్లగా తాము సాగు చేస్తున్న అటవీ భూములకు సాగు పట్టాలు ఇవ్వాలని కోరితే జెరాక్స్ కాగితాలను చేతిలో పెట్టి, వీటినే ఒరిజినల్ సాగు పట్టాలు అనుకోవాలని అధికారులు చెబుతున్నారంటూ గిరిజనులు నిరసన తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని బొర్రపనుకువలస గ్రామంలో గిరిజన రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆదివాసీ జరిగిన సంఘం మండల అధ్యక్షుడు వంతల సుందరరావు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి తాడంగి గాసి మాట్లాడారు.