తాడిపత్రి పట్టణంలో గంట గంటకు ఉత్కంఠ భరితంగా మారుతుంది తమ సమస్యలను పరిష్కరించడంలో పోలీసులు విఫలమయ్యారని ఏఎస్పీ కార్యాలయం ఎదుట మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి మంచం వేసుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. అటు నుంచి పట్టణంలోని అశోక్ పిల్లర్ వద్ద చైర్ లో కూర్చొని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సాయంత్రం నుంచి ఇప్పటివరకు అశోక్ పిల్లర్ వద్ద కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎవరితోనో మాట్లాడకుండా మహాత్మా గాంధీ బాటలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని జేసీ ప్రభాకర్ రెడ్డికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.