భూపాలపల్లి నియోజకవర్గంలోని కొత్తపల్లి గోరి మండలంలోని సుల్తాన్పూర్ గ్రామం నుండి వెంకటేశ్వర పల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి మరమ్మతు చేయాలని, అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడంలేదని, వర్షాలకు రోడ్లు మొత్తం బురదమయంగా మారి రైతులకు, విద్యార్థులకు ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారిందని ప్రమాదాలు జరుగుతున్న ఎవరూ పట్టించుకోవడంలేదని,శుక్రవారం 8 గంటలకు రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపినట్లు సుల్తాన్పూర్ గ్రామస్తులు తెలిపారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్డు మరమత్తు పనులు చేపట్టాలని సుల్తాన్పూర్, వెంకటేశ్వర పల్లి గ్రామస్తులు కోరుతున్నారు.