శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం పి. రొప్పాల గ్రామంలో ప్రభుత్వ వైద్యశాల నిర్మాణానికి మంత్రి సవిత గురువారం మధ్యాహ్నం భూమి పూజ చేశారు. రూ. 2 కోట్లతో నిర్మించనున్న ఈ వైద్యశాల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా, టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి కూడా మంత్రి సవిత భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.