ప్రకృతి సంరక్షణే దేశ సేవ, భగవంతుని సేవ అని కేంద్ర పౌర విమానాయశాఖ మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు అన్నారు. నగరంలోని మట్టి వినాయక ప్రతిమలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి మంగళవారం భక్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, మట్టి గణేశ ప్రతిమల వినియోగమే కాలుష్యరహిత సమాజానికి మార్గమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ సహజ మట్టితోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని తెలిపారు. గత పదేళ్లుగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా అందిస్తున్నామని