శ్రీశైలం క్షేత్రాన్ని వేరే జిల్లాలో కలపకుండా కాపాడుకోవాలని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో రైతు సంబర సభలో ఆయన మాట్లాడారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో సౌలభ్యం కొరకు మండలాలను ,డివిజన్లను, జిల్లాలను ఏర్పాటు చేయదలుచుకుందన్నారు. ఇందులో భాగంగా శ్రీశైలం క్షేత్రాన్ని మార్కాపురం చెందిన వారు తమ డివిజన్లో కలపాలని ప్రయత్నాలు చేస్తున్నారని మన ఆరాధ్య దైవం ,మనకు ఎంతో సెంటిమెంటు, మన తాత ముత్తాతల కాలం నుండి శ్రీశైలం క్షేత్రం ఉమ్మడి కర్నూలు జిల్లా భూభాగం లోనే ఉందని,