బావిలో పడి వృద్ధురాలి మృతి.. ప్రమాదవశాత్తు బావిలో పడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇందిరానగర్ గ్రామానికి చెందిన అల్వాల లచ్చమ్మ అనే వృద్దురాలు ప్రమాద వశాత్తు గురువారం సాయంత్రం వ్యవసాయ బావిలో పడి మృతి చెందింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.