బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్న బీసీ సంఘం నాయకులు న్యాయవ్యవస్థలో బీసీలకు జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ కు బహిరంగ లేక రాశారు .ఈ సందర్భంగా బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్మల శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ జనాభాలో 60 శాతం బీసీ జనాభా ఉండగా న్యాయవ్యవస్థలో కేవలం రెండు శాతం మాత్రమే ఉన్నారని తెలిపారు వెంటనే న్యాయవ్యవస్థలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు.