YCP జీడీనెల్లూరు ఇన్‌ఛార్జ్‌ను మారుస్తారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని వైసీపీ ఇన్‌ఛార్జ్ కృపాలక్ష్మి స్పష్టం చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తలు రాయకండి. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ నేను, మా నాన్న నారాయణ స్వామి అందరికీ అందుబాటులో ఉన్నాం. అవాస్తవాలను ఎవరూ నమ్మవద్దు’ అని కోరారు. వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా కృపాలక్ష్మిని తప్పించి హరికృష్ణను నియమిస్తారని ప్రచారం జరిగింది.