అనంతపురం జిల్లా వడ్డిపల్లి వద్ద ముందుగా ఉన్న ఆగి ఉన్న లారీని వెనుక నుంచి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాలు ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో అనంతపురం నగరానికి చెందిన శ్రీపతి, సిద్దాలాపురం గ్రామానికి చెందిన లోకనాథ్ చౌదరి గాయపడ్డారు. గాయపడిన వారిని 1033 నేషనల్ హైవే అంబులెన్స్ తో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.