సుప్రీంకోర్టు నియమ నిబంధనకు లోబడి సౌండ్ బాక్స్లను ఏర్పాటు చేయాలని అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఇచ్చోడ సీఐ బండారి రాజు తెలిపారు. గురువారం నేరడిగొండ మండలం వడూరు గ్రామంలో గణపతి మండపాల వద్ద నిబంధనలకు అధిక్రమించి ఏర్పాటు చేసిన 4 డీజే లను స్వాధీనం చేసుకొని డీజే యజమానులపై, ఆపరేటర్ల పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగేలా అధిక శబ్దం వచ్చే విధంగా డీజే లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.