నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఆదివారం జరిగిన వినాయక నిమజ్జనం ఉత్సవాలలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పాల్గొన్నారు. పట్టణంలోని విగ్రహాలన్నీ కైప చెరువులో నిమజ్జనం గావించారు. బీసీ ఇందిరమ్మ, సీఐలు మంజునాథ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొని, మొదటి వినాయకుడిని నిమజ్జనం చేశారు.చెరువులో ప్రత్యేక పూజలు చేశారు.