అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గురువారం రాత్రి శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని తాడిమరి మండలం రామాపురం గ్రామానికి చెందిన వివాహిత చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈనెల 19వ తేదీన రామాపురం గ్రామానికి చెందిన రామాంజినమ్మ ను ఆమె భర్త రాజు విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.