రుద్రవరం మండలంలో ఇవాళ జరగనున్న వినాయక నిమజ్జనం సమయంలో మద్యం తాగి వాహనాలు నడపడం, ఉత్సవాల్లో పాల్గొనడం చేయకూడదని సిరివెళ్ల సీఐ దస్తగిరి బాబు సూచించారు. శుక్రవారం మండల వ్యాప్తంగా జరిగే నిమజ్జనం ఉత్సవాల్లో ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉత్సవ కమిటీ సభ్యులదేనన్నారు. ఎలాంటి గొడవలు, అల్లర్లకు తావులేకుండా ప్రశాంతంగా పండుగను జరుపుకోవాలని సూచించారు.