శ్రీ సత్య సాయి జిల్లా బుక్కపట్నం మండలం గూనిపల్లిలో మంగళవారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. వడ్డెర పని చేసుకుని సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి రోజువారి పనిలో భాగంగా మంగళవారం రోజున కూడా బిట్టగుంటపల్లి సమీపాన ఉదయం పనికి వెళ్ళాడు. పనులు చేస్తుండగా రాళ్లు మీద పడడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు గుర్తించిన స్థానికులు రాళ్ళను తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. ఇంటి పెద్ద దిక్కున కోల్పోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.